చైనాలో 2 వేలకు దాటిన కరోనా మృతులు

కరోనా వైరస్ మృతుల సంఖ్య అంతకంతా పెరుగుతోంది. కొవిడ్ -19 మహమ్మారితో చైనాలో చనిపోయిన వారి సంఖ్య 2 వేలకు దాటింది.  ఇవాళ మరో 136 మందిని బలిగొంది వైరస్. చనిపోయిన వారంతా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న హుబెమ్ ప్రావిన్సుకు చెందిన వారు. అటు బాధితుల సంఖ్య  74 వేలకు చేరింది.  వీరిలో 11 వేల మందికి పరిస్థితి విషమంగా ఉంది.

మరోవైపు ఇప్పటి వరకు 14 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది చైనా సర్కార్. హాంకాంగ్ లో 62 కేసులు,  మకావులో 10, తైవాన్ లో 22 మందికి వైరస్ సోకింది. ఫ్రాన్స్, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్ దేశాల్లో  ఇప్పటికే ఒక్కరు చొప్పున చనిపోయారు.

see also: 93 ఏళ్ల వయసులో పీజీ పట్టా

see also: ‘నాన్న’కూ 7 నెలల సెలవులు

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

Latest Updates