40,171 మందికి కరోనా కన్ఫమ్… చైనాలో 908కి పెరిగిన మృతులు 

చైనాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పేషంట్లు చనిపోతూనే ఉన్నారు. సోమవారం నాటికి చైనాలో మొత్తం 40,171 మందికి కరోనా సోకినట్లు కన్ఫమ్ అయింది. మృతుల సంఖ్య 908కి పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 97 మంది పేషంట్లు చనిపోయారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు వెల్లడించారు. దేశంలోని 31 ప్రొవిన్షియల్ స్థాయి ప్రాంతాల్లో కరోనా తీవ్రంగా వ్యాపించిందని తెలిపారు. హాస్పిటళ్ల నుంచి ఆదివారం 29,307 మందిని డిశ్చార్జ్ చేశామని, ఇంకా 1.87 లక్షల మందిని మెడికల్ అబ్జర్వేషన్ లో ఉంచామని పేర్కొన్నారు.

మనదేశంలో1,97,192 మందికి స్క్రీనింగ్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మన దేశంలో 1,818 ఫ్లైట్లలో వచ్చిన ప్యాసింజర్లకు ఎయిర్ పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం లోక్ సభకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం1,97,192 మందికి స్క్రీనింగ్ చేశామని తెలిపారు. 12 మేజర్ సీ పోర్టులు, పలు మైనర్ పోర్టుల్లో కూడా స్క్రీనింగ్ ప్రారంభించామని పేర్కొన్నారు.

చేతులు క్లీన్ గా ఉంటే వైరస్ ముప్పు తక్కువ

ఎయిర్ పోర్టుల వంటి రద్దీ ప్రదేశాల్లోకి ప్రవేశించే ముందు చేతులను సబ్బు, నీళ్లతో కడుక్కుంటే కరోనాతో పాటు ఫ్లూ వంటి ఇతర పలు వైరస్ ల వ్యాప్తి కూడా చాలా వరకూ తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది.

Latest Updates