కరోనా ఎఫెక్ట్: ఈనెల 21వరకు సినీ షూటింగ్స్ బంద్

కరోనా ఎఫెక్ట్ మూవీ ఇండస్ట్రీపై కూడా పడింది. ఈనెల 21వరకు షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రకటన జారీచేశారు. తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారాంగ్ మాట్లాడుతూ24 విభాగాలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించామని తెలిపారు. అయితే షూటింగ్‌లో చాలామంది పాల్గొంటారని వారందరి ఆరోగ్యాన్ని దృష్టిలోవుంచుకుని ఈనెల 21వరకు షూటింగ్స్ నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఈ మీటింగ్‌లో…. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, సెక్రెటరీ జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ లు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, నట్టి కుమార్, ట గుర్ మధు, రామా సత్యన్నారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates