కరోనా సోకిన మొదటి శునకం మృతి

అమెరికాలో మొదటిసారి కరోనావైరస్ బారిన పడిన శునకం చనిపోయినట్లు నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ప్రచురించింది. న్యూయార్క్ కు చెందిన రాబర్ట్ మహోని ఏప్రిల్ లో కరోనా బారినపడ్డాడు. అతని ద్వారా ఆయన పెంపుడు శునకం బడ్డీ కూడా కరోనా బారినపడింది. అయితే రాబర్ట్ కరోనా నుంచి కోలుకున్నాడు. కానీ బడ్డీ మాత్రం కోలుకోలేకపోయింది. బడ్డీ అమెరికాలోనే కరోనావైరస్ సోకిన మొదటి జంతువు. దాంతో బడ్డీ గురించి అమెరికా మొత్తం తెలిసిపోయింది. బడ్డీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పాటు.. ముక్కు కారడం వంటివి మొదలై.. వారాలు గడిచేకొద్దీ తీవ్ర అనారోగ్యం పాలైంది. జూలై 11న రక్తం కక్కడం, మూత్ర విసర్జనలో రక్తం పడటం, నడవలేకపోవడం జరిగాయి. అయితే రాబర్ట్ భార్య అల్లీసన్ వెంటనే బడ్డీని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకుంది. కానీ, కరోనా వల్ల ఆస్పత్రులన్నీ మూసివేయబడి ఉన్నాయి. దాంతో బడ్డీకి సరైన వైద్యం అందక మృతిచెందినట్లు అల్లీసన్ తెలిపింది.

For More News..

బీరు తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి.. తెల్లారేసరికి..

ఐపీఎల్ ప్లేయర్లకు 4 సార్లు కరోనా టెస్టులు

లెక్కల్లో చూపని బంగారం ఉంటే ఫైన్ కట్టాల్సిందే!

Latest Updates