భారతీయ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు

కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. నిన్నటి దాకా పాశ్చాత్య సంస్కృతి మనోళ్లను ఆకర్షించేంది. ఇప్పుడు ట్రెండ్ మారింది. యూరోపియన్ దేశాలు కూడా భారతీయ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉండడంతో వెస్ట్రన్ పలకరింపులకు అందరూ గుడ్ బై చెబుతున్నారు. షేక్ హ్యాండ్ వద్దు.. నమస్తే ముద్దు అంటూ ప్రాచీన భారత సంప్రదాయం వైపు అడుగులు వేస్తున్నారు.
ముద్దులు పలకరించుకోవడం (లా బిసే) ఫ్రాన్ సంప్రదాయం.. దానిని పక్కన పెట్టి ఫ్రాన్ అధ్యక్షుడు మాక్రాన్ తన అతిథులను ఇండియన్ స్టైల్ లో రెండు చేతులు జోడించి నమస్తే అంటూ పలకరించడం స్టార్ట్ చేశారు.

బుధవారం నాడు స్పెయిన్ కింగ్ ఫెలిప్, క్వీన్ లెతీజియా పారిస్ పర్యటనకు వెళ్లారు. వారికి స్వాగతం పలికిన ఫ్రాన్ అధ్యక్షుడు మాక్రాన్ పాశ్చాత్య పద్ధతిలో కాకుండా భారత సంప్రదాయంలో పలకరించారు. రెండు చేతులు జోడించి నమస్కరించారు. ఇటీవలే ఫ్రాన్స్ ప్రభుత్వం దేశంలో ప్రజలకు షేక్ హ్యాండ్, ముద్దుల ద్వారా పలకరించుకోవద్దంటూ సూచించిన నేపథ్యంలో అధ్యక్షుడి కొత్త ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి స్పెయిన్, ఫ్రాన్స్.. రెండు దేశాల్లోనూ ఎక్కువగానే ఉంది. స్పెయిన్ లో ఇప్పటికే 2124 మంది, ఫ్రాన్స్ లో 1784 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.
కాగా, గత వారంలో లండన్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ ఈవెంట్ లో బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ కూడా అతిథుల్ని ఇండియన్ స్టైల్ లో నమస్తేతో పలకరించారు.

More News:

ముద్దులపై ఆంక్షలు: ‘లా బిసే’ సంప్రదాయానికి బ్రేక్

బావిలో దూకాల్సి వచ్చినా.. ఆయన వెంటే నడుస్తా

రెండ్రోజుల క్రితమే ప్రకటన!

ఇకపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇతర దేశాల అధినేతలను కలిసినప్పుడు భారత సంప్రదాయంలో నమస్తే అని పలికరిస్తారని రెండ్రోజుల క్రితమే ఆ దేశ దౌత్యాధికారి చెప్పారు. భారత్ లో ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయేల్ లెనిన్ ఈ విషయాన్ని మంగళవారం ట్వీట్ చేశారు. 2018లో మాక్రాన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ సంప్రదాయాన్ని తెలుకున్నారని, ఇకపై దాన్నే పాటించాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలిపారు.

Latest Updates