మా ప్రిపరేషన్స్​ను కరోనా అడ్డుకోలేదు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు మిగతా అన్ని జట్ల ఒలింపిక్స్​సన్నాహాలు దెబ్బతిన్నా..తాము మాత్రం ట్రెయినింగ్ కొనసాగిస్తున్నామని నేషనల్‌‌ హాకీ టీమ్ ​చీఫ్​ కోచ్ ​గ్రహమ్​ రీడ్ ​చెప్పాడు. కరోనా ప్రభావాన్ని తగ్గించడానికి స్పోర్ట్స్​అథారిటీ ఆఫ్​ఇండియా (సాయ్), హాకీ ఇండియా (హెచ్​ఐ) తీసుకుంటున్న చర్యలను రీడ్​ మెచ్చుకున్నాడు. రోజురోజుకూ పరిస్థితులు మారిపోతున్నాయని, అయినా వేరే దేశాలతో పోలిస్తే మనం ట్రెయినింగ్ ను కొనసాగిస్తున్నామని పేర్కొన్నాడు. ‘టీమిండియా ప్లేయర్లు ఐసోలేషన్​లో ఉన్నప్పటికీ షెడ్యూల్ ​ప్రకారం సన్నాహకాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఉంటూనే పెర్త్​లో ప్రాక్టీస్​ చేస్తున్నారు. అర్జెంటీనా ప్లేయర్లు సెంట్రలైజ్డ్​ ప్రోగ్రామ్​ను ప్లాన్​ చేసినప్పటికీ.. ఈ పరిస్థితుల్లో వారు ట్రెయినింగ్  ​చేయడం కష్టమే.

మన జట్టు మాత్రం ఒకే దగ్గర ఉంటూ సన్నాహకాలు చేస్తోంది. క్యాంపులో మొత్తం 32 మంది ప్లేయర్లు ఉన్నారు. వారితో కాంపిటీటివ్ ​హాకీ ఆడిస్తున్నాం. ఇంటర్నేషనల్​ లెవెల్ ట్రెయినింగ్ సాగుతోంది. ప్రతి రోజు వైవిధ్యమైన స్టయిల్స్ లో హాకీ ఆడుతున్నారు. ఒక రోజు జర్మన్స్​లా, మరో రోజు ఆస్ట్రేలియాలా.. విభిన్న రీతిల్లో ప్రాక్టీస్ ​కొనసాగుతోంది. హాకీ ఇండియాతోపాటు గవర్నమెంట్ నుంచి తదుపరి​ సూచనల కోసం ఎదురుచూస్తున్నాం. దాని ప్రకారం అవసరమైతే మా ఒలింపిక్​ ప్రిపరేషన్ ను రీ షెడ్యూల్​ చేస్తాం. ఒలింపిక్స్ వాయిదాపై ఇంటర్నేషనల్ ​ఒలింపిక్​ అసోసియేషన్, టోక్యో గేమ్స్​ఆర్గనైజర్లు నిర్ణయం తీసుకుంటారు. ప్రపంచ క్రీడల్లో భాగం కావాలనేది ప్రతి ఒక్క అథ్లెట్ చిరకాల కోరిక. ఇలాంటి సమయంలో ప్లేయర్లు పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండాలి. ఒలింపిక్స్​లో ఆడతామనేదే వారికి అతిపెద్ద స్ఫూర్తి. ఇటీవల టాప్–-3 టీమ్స్​తో మూడు ప్రొ లీగ్​మ్యాచ్‌ల్లో తలపడ్డాక.. శక్తిమేర​ఆడితే ఏదైనా చేయగలమనే నమ్మకానికి వచ్చాం’ అని వివరించాడు.

Latest Updates