హెల్తీ యంగ్‌‌స్టర్స్‌‌కు మరో రెండేళ్లదాకా నో వ్యాక్సిన్

న్యూఢిల్లీ: ఆరోగ్యంగా ఉన్న యువకులకు 2022 వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని డబ్ల్యూహెచ్‌‌వో తెలిపింది. బుధవారం నిర్వహించిన డబ్ల్యూహెచ్‌‌వో సోషల్ ఈవెంట్‌‌లో సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వ్యాక్సిన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘వ్యాక్సిన్‌‌ను తొలుత హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హయ్యస్ట్ రిస్క్ ఉన్న వారితోపాటు వయస్సు మీద పడ్డవారికి ఇవ్వాలనే దానికి అందరూ మద్దతు తెలుపుతారు. వ్యాక్సినేషన్ కోసం యువకులు 2022 వరకు వెయిట్ చేయాల్సిందే’ అని సౌమ్య చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విజృంభిణ కొనసాగుతుండటంతో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇండియాతో పాటు పలు దేశాల్లో కొన్ని వ్యాక్సిన్‌‌లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates