కరోనా కష్టాలు : జేబు ఖాళీ కాకుండా చూసుకోండి

ఉదయం ఆరు గంటల నుంచి మొదలుపెడితే సాయంత్రం ఆరు గంటల వరకు మనకు కావాల్సిన నిత్యావసరాలు దొరికే కిరాణ షాపులు, కూరగాయలు అమ్మే దుకాణాలు తీసే ఉంటాయి. సాయంత్రం ఆరు దగ్గర పడకముందే అన్ని షాపులకూ తాళాలు పడుతున్నాయి. ఆ తర్వాత ఇంక కర్ఫ్యూనే. కాబట్టి ఏం కొన్నా ఈ పొద్దున్నే కొనాలి. దాదాపు పన్నెండు గంటలు షాపులు తీసే ఉంటున్నాయి కాబట్టి ఎగబడి పోయి కొనాల్సిన పని లేదు. తక్కువ మంది జనం ఎప్పుడు ఉంటున్నారో చూసుకొని వెళితే సరిపోతుంది

ఎండాకాలం వచ్చిందంటే నేలలోపల ఎక్కడెక్కడో దాక్కున్న చీమలన్నీ బయటకు వచ్చేస్తాయి. వేడిని తట్టుకోలేక బయటకొస్తాయని అందరూ అనుకుంటారు. నిజానికి అవి బయటకొచ్చేది తిండి గింజలు సంపాదించుకోవడానికి. ఎందుకంటే వానాకాలం బయటికెళ్లే పరిస్థి తి ఉండదు. అందుకే ఆ నాలుగు నెలలూ ఇంట్లోనే కూర్చుని తినడానికి తిండి కావాలి. కాబట్టి ఎండాకాలమంతా కష్టపడతాయి. ఇక వర్షాకాలం మొదలైందంటే అడుగు బయటపెట్టకుం డా ఇన్నిరోజులూ సంపాదించుకున్న తిండిని ఏమాత్రం వేస్ట్ చేయకుండా పొదుపుగా తింటాయి. చీమలకు వానాకాలంలో వచ్చే కష్టమే ఇప్పుడు మనకు కూడా వచ్చిపడింది. కరోనా వైరస్ అంటుకుంటుందనే భయంతో అందరం ఇంట్లోనే ఉంటున్నాం. అయితే చీమల్లాగే మనమూ ముందుజాగ్రత్తగా సరుకులు, డబ్బులు మన అవసరాలకు సరిపడా తెచ్చిపెట్టుకున్నాం. అయితే ఈ పరిస్థి తి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. అందుకే ఇప్పుడు మనం కూడా చీమల ఫిలాసఫీని ఫాలో కావాలి. అంటే… ఉన్నదాన్ని పొదుపుగా వాడుకోవాలి. డబ్బులున్నా… ఒక్కోసారి మనం ఎంత డబ్బున్నవాళ్లమైనా  .. ఆ డబ్బు మన ఆకలిని తీర్చదు. బ్యాంక్ బ్యాలెన్స్  ఉంది కదా అని నిశ్చింతంగా ఉండడానికి వీల్లేదు. డబ్బులున్నా యికదా… అని ఈరోజే ఇంట్లో ఉన్న సరుకులను ఇష్టమొచ్చినట్లుగా వాడొద్దు. ఎందుకంటే… రేపు డబ్బులు పెట్టినా కొనడానికి అవసరమైనవి దొరక్కపోవచ్చు. ఇప్పటికే నిత్యావసరాలు తప్ప మిగిలినవేవీ దొరకడం లేదు. రేపు నిత్యావసరాలకు కూడా అదే పరిస్థి తి రావొచ్చు. అలాగని ఉన్న డబ్బులతో అవసరం ఉన్నవీ, లేనివి కొనుక్కొచ్చి ఇంట్లో పడేయొద్దు. ఇలా ఆలోచించే వాళ్లతోనే  నిత్యావసరాల కొరత ఏర్పడుతుంది. మన అవసరాలకు సరిపడా తెచ్చుకొని, వాటిని పొదుపుగా వాడుకుంటేచాలు.. అదే మనం ఇప్పుడు సమాజానికి చేసే కొండంత మేలు. పొదుపుగా వాడడమంటే.. పొదుపుగా వాడడమంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే. ఎందుకంటే పెద్దగా పనేమీ లేకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాం. ఖాళీగా ఉంటే ఏవేవో తినాలనిపిస్తుంది. దీంతో టీవీ ముందు కూర్చుని రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేయమని ఇంట్లో ఆడవాళకి ఆర్డర్లు  చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల సరుకులు అయిపోవడమే కాదు.. మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. శారీరక శ్రమ ఏమీ చేయకుండా మిర్చీలు, బజ్జీలు , పకోడీలు అంటూ ఏది పడితే అది తింటే అసలుకే మోసం వస్తుంది. అందుకే పొదుపుగా వాడడమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్తనోరు కట్టుకోవడమే. సరుకులే కాదు… పొదుపుగా వాడడం అనే కండిషన్ కేవలం సరుకులకు మాత్రమే వర్తించదు. ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. కొన్నిసార్లు వీటిని కూడా పొదుపు చేయాలా? అనిపిస్తుంది. కానీ తప్పదు, చేయాల్సిందే. ఎగ్జాంపుల్.. ఇంట్లో ఉంటున్నాం కదా అని ఇంటర్నెట్ను ఎడాపెడా వాడేస్తాం. కరోనా వార్తలు వినేందుకు, సినిమాలు చూసేందుకు, ఫ్రెండ్స్తో చాటింగ్, బయటికెళ్లే పరిస్థి తి లేదు కాబట్టి వీడియో కాలింగ్… ఇలా అన్నిటికీ ఇంటర్నెట్నే యూజ్ చేస్తుంటాం. దీంతో నెలరోజులు రావాల్సిన 200 జీబీ డాటా వారం రోజుల్లో అయిపోతుంది. మళ్లీ రీఛార్జ్  చేసుకోవచ్చుకదా.. అనుకోవద్దు. ఎందుకంటే టెలిఫోన్ కంపెనీలు, యూట్యూబ్ వంటివే ఇంటర్నెట్ను పొదుపు చేసేందుకు తక్కువ క్వాలిటీ వీడియోలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నాయి. రేపు.. వినియోగాన్ని బట్టి మాత్రమే డాటా ఇచ్చే పరిస్థి తి రావొచ్చు. ఆ డాటా మీరు ఇప్పటికే వాడేస్తే రేపు రీఛార్జ్ డాటా రాకపోవచ్చు. అందుకనే ఇంటర్నెట్ను కూడా పొదుపుగా వాడాల్సిందే.

ఇంకా ఏమేం ఉన్నాయంటే…

నీళ్లు ..

వీటిని కూడా పొదుపు చేయడం ఎంతో అవసరం. ఎందుకంటే ఆల్రెడీ వేసవి వచ్చేసింది. నీటి కష్టాలు మొదలవుతాయి. అయితే మునుపటిలా ట్యాంకరతో సంపులు నింపుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక ట్యాంకర్ మన ఇంటికి రావాలంటే దాని వెనుక ఎంతోమంది పనిచేయాల్సి ఉంటుంది. వాళ్లంతా ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థి తి లేదు. కాబట్టి రేపు ట్యాంకర్ కూడా దొరక్కపోవచ్చు. అందుకే మున్సిపల్ వాటర్నే జాగ్రత్తగా స్టోర్ చేసుకొని, పొదుపుగా వాడుకోవాలి.

కూరగాయలు..

ఇవాళ పొద్దున్నే కూరగాయల బండి వచ్చింది కదా అని.. ఈ రోజు కొన్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను ఈ రోజే వాడేయొద్దు. ఇవాళే మొత్తం వాడేస్తే రేపు కూరల్లో వేయడానికి ఉండకపోవచ్చు. ఎందుకంటే రేపు ఆ బండి కూడా రావొచ్చు, రాకపోవచ్చు. అందుకే కొన్న కూరగాయలను పొదుపుగా వాడుకోవాలి. ఓ రోజు పప్పు, ఇంకోరోజు ఏదైనా కూరగాయలు వండుకోవాలి.

పాలు..

లాక్డౌన్ కొనసాగుతున్నందున నిత్యావసరాల్లో ఒకటైన పాలు కూడా ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దొరికే పరిస్థి తి ఉంది. ఆ తర్వాత కావాలన్నా దొరకవు. అయితే ఇంట్లోచిన్న పిల్లలు ఉన్నవాళ్లు మాత్రం పాల విషయంలో పొదుపుగా ఉండాలి. పిల్ల ల కోసం తప్పనిసరిగా పక్కన పెట్టి, మిగిలినవి మాత్రమే పెద్దవాళ్లు వాడాలి. ఎందుకంటే షాపులు తెరిచి ఉన్నప్పుడు కూడా పాలు దొరక్కపోవచ్చు. అలాగని ఎక్కువ కొని పెట్టుకుంటే విరిగిపోతాయి.

మందులు..

కాస్త తలనొప్పిగా అనిపించినా, జ్వరంగా ఉన్నా వెంటనే మాత్రలు వేసుకోవద్దు. ఎందుకంటే ఎప్పటిలా కాకుండా ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి కాస్త నలతగా అనిపించొచ్చు. అటువంటప్పుడు ఫోన్ పట్టుకునే ఉండకుండా ఇంట్లోవాళతో క ్ల బుర్లు చెబుతూ గడిపితే ఎటువంటి సమస్య ఉండదు. మెడికల్ షాప్లు తెరిచే ఉన్నాయి కదా అని ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ను అవసరం లేకున్నా వేసుకోవద్దు. దీనివల్ల కొత్త సమస్యలు రావొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్పత్రులకు కూడా వెళ్లలేం. వెళ్నాలి .. అక్కడ జనాలు ఉంటారు. వాళతో ్ల కలిసి ఉంటే కరోనా ముప్పు తప్పకపోవచ్చు. మరీ భరించలేనంతగా ఉంటే మాత్రమే ట్యాబ్లెట్స్ జోలికి వెళ్లాలి.

కరెంట్..

హైదరాబాద్లో పర్వాలేదు. కానీ.. పల్లెటూళలో ్ల కరెంటు కోతలుబాగానే ఉంటున్నాయి. అందుకే కరెంటును కూడా పొదుపుగా వాడుకోవాలి. అంటే… కరెంటు ఉన్నప్పుడు ఫోన్ చారింగ్్జ పెట్టుకోవడం, అవసరమైతే పవర్ బ్యాంక్ను ఫుల్ చారింగ్్జ చేసుకోవడం వంటివి. కరెంటు లేనప్పుడు ఫోన్చూస్తూ కూర్చుంటే చారింగ్్జ అయిపోతుంది. మళ్ చాలీ రింగ్్జ చేసుకోవడానికి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ఫోన్లో ఉన్న చారింగ్్జ ను కూడా పొదుపుగానే వాడుకోవాలి.

టైం..

ఇప్పుడు కావలసింత టైం ఉంది. దాన్ని ఎలాపడితే అలా వాడుకుంటామంటే కూడా కుదరదు. ఎందుకంటే.. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి. అంటే ఇంట్లో ఉండి పని చెయ్యాలి. చాలా టైం ఉంది కదా అనిముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటే.. సమయానికి పని పూర్తి కాకపోవచ్చు. దీనివల్ల ఆఫీస్లో మిగతావాళ ప్ల ని కూడా ఆగిపోతుంది. అది చివరకు ఉద్యోగానికే ఎసరు పెట్టొచ్చు. అందుకే సమయాన్ని కూడా పొదుపుగా వాడుకోవాలి. ముందు అవసరమైన పనులన్నీ పూర్తిచేసి, ఆ తర్వాతే మిగతావాటి జోలికెళ్లాలి.

More News

కరోనా.. కేరాఫ్ ఢిల్లీ మర్కజ్

13 కోట్ల కొలువులకు కోత

Latest Updates