కరోనా వైరస్ ఎమర్జెన్సీ ప్యాకేజీ రూ.15వేల కోట్లు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. గురువారం రూ. 15వేల కోట్లప్యాకేజీని ప్రకటించిం ది. దీన్ని ‘‘కొవిడ్–19 ఎమర్జెన్సీ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్  నెస్  ప్యాకేజీ’’గా పేర్కొంది. నేషనల్, స్టేట్ లెవల్ హెల్త్ సిస్టమ్ బలోపేతా నికి ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. దీనికి 100 శాతం ఫండింగ్ ను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనుంది. ఈ ప్యాకే జీని మొత్తం మూడు దశల్లోఅమలు చేయనుంది. జనవరి 2020 నుంచి జూన్ 2020, జూలై 2020 నుంచి మార్చి 2021, ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2024 వరకు స్కీమ్ ను అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అన్ని రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఫండ్ ను విభజిస్తామని తెలిపింది.

ఏమేం చేస్తరు?

నేషనల్, స్టేట్ లెవెల్ లో అవసరమైన డ్రగ్స్, మెడికల్ ఎక్విప్ మెంట్స్ సమకూర్చుకోవ డం, సర్త్వైలైన్స్  బలోపేతం చేయడం, ల్యాబ్ ల ఏర్పాటు, బయోసెక్యూరిటీ సన్నద్ధత కోసం ఈ ప్యాకే జీని అమలు చేయనున్నట్లు కేంద్రం వెల్ల డించింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రా లు, యూనియన్ టెరిటరీల చీఫ్ సెక్ర టరీలు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు,  సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ లెటర్లు రాసింది. ఫస్ట్ ఫేజ్ లో కరోనా హాస్పిటళల్లో  ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు, వెంటి లేటర్లు, ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామంది. సిబ్బందిని నియమిస్తామని, వలంటీర్లకు  ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపింది. హాస్పిటళ్లు, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లి క్ యుటిలిటీస్, అంబులెన్స్ లలో  ఫస్ట్ ఇన్ఫెక్టెం ట్స్ స్ప్రే చేస్తామని ప్రకటించిం ది. ఫస్ట్ ఫేజ్ లోనే భాగంగా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్స్ (పీపీఈ), ఎన్ 95 మాస్క్ లను కొనుగోలు చేస్తామని వెల్లడించింది.  ఫస్ట్ ఫేజ్ ఫండ్స్ ను నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చే జూన్ నాటికి రిలీజ్ చేస్తామంది. ప్యా కేజీలో భాగంగా కొన్ని ల్యాబ్లను గుర్తించి, వాటిలో డయాగ్నస్టిక్ సామర్ధ్యం పెంపొంది స్తామని, శాంపిళ్ల ట్రాన్స్  పోర్టుకు మొబిలిటీకి సపోర్ట్ చేస్తామని తెలిపింది.

Latest Updates