ఒక్క‌రోజే యూఎస్ లో 1,600 మంది మృతి

coronavirus-kills-over-1600-americans-in-just-one-day-total-death-toll-tops-16000
  • 17 వేలు దాటిన కరోనా మరణాలు

వాషింగ్టన్​ : అమెరికాలో కరోనా వైరస్ వల్ల ఒక్కరోజులోనే 1600 మంది చనిపోయారు. గురువారం కొత్తగా 27 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 4.75 లక్షలకు చేరగా, 17,000 మంది వైరస్ కు బలైపోయారు. కరోనా ఈ వారం పీక్ స్టేజీకి చేరుకుంటుందని, దీంతో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని అధికారులు హెచ్చరించారు. ఈ వారంలో మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని వారు చెప్పారు. అమెరికన్లంతా సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. న్యూయార్క్ లో అత్యధికంగా 1.61 లక్షల కేసులు, 7 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే రోజూ ఐదారు వందల మంది చనిపోతున్నారు.

Latest Updates