కరోనా వైరస్‌ ఎప్పటికి ఉంటుంది: బ్రిటీష్ శాస్త్ర‌వేత్త జాన్ ఎడ్మండ్స్ 

కరోనా వైరస్ నిర్మూల‌న అసాధ్యమని… ఆ వైర‌స్ ఎప్ప‌టికీ ఉంటుంద‌ని బ్రిటీష్ శాస్త్ర‌వేత్త జాన్ ఎడ్మండ్స్ తెలిపారు. ప్ర‌భుత్వ అడ్వైజ‌రీ క‌మిటీలో స‌భ్యుడైన శాస్త్ర‌వేత్త జాన్ ఎడ్మండ్స్ ఈ విష‌యాన్ని తెలిపారు. కానీ టీకా కారణంగా వైర‌స్ ప‌రిస్థితిలో కొంత మార్పు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. యూరోప్‌లోని కొన్ని దేశాల‌తో పాటు బ్రిట‌న్‌లో కూడా ఇటీవ‌ల మ‌ళ్లీ కరోనా కేసులు పెరిగాయి. కొన్ని దేశాలు కొత్తాగా మ‌ళ్లీ ఆంక్ష‌ల‌ను కూడా అమ‌లు చేస్తున్నాయి. వైర‌స్‌తో ఇక ఎప్ప‌టికీ జీవించాల్సిందే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎడ్మండ్స్. క‌రోనా వైర‌స్‌ను శాశ్వ‌తంగా నిర్మూలించే అవ‌కాశం చాలా స్వ‌ల్పంగా ఉన్న‌ట్లు అంచ‌నా వేశారు. ఈ విష‌యాన్నే ఆయ‌న బ్రిట‌న్ ప్ర‌భుత్వానికి తెలిపారు. వైర‌స్ శాశ్వతంగానే ఉన్నా.. శీతాకాలం చివ‌రి నాటికి టీకాను అభివృద్ధి చేస్తే అప్పుడు ప‌రిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని ప్ర‌భుత్వానికి ఎడ్మండ్స్ చెప్పారు. వ్యాక్సిన్ వ‌స్తే వైర‌స్ వ్యాప్తి  కేసులు త‌గ్గే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. ఆరు ర‌కాల కోవిడ్ టీకాల కోసం బ్రిట‌న్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న‌ద‌ని..సుమారు 34 కోట్ల డోసుల‌ను తెప్పించ‌నున్న‌ట్లు ఎడ్మండ్స్ చెప్పారు.

Latest Updates