లాక్ డౌన్ ఎఫెక్ట్: కొడుకు చేత షేవ్ చేయించుకున్న కేంద్ర మంత్రి

కరోనా వైర‌స్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంది. దీంతో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు, పొలిటిషియ‌న్లు ఇళ్ల‌కే ప‌రిమితమ‌వ్వాల్సిన ప‌రిస్థితి. అయితే ఈ క్వారంటైన్ టైమ్ లో చాలామంది త‌మ కుటుంబ స‌భ్యుల‌తో స‌మ‌యాన్ని స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. త‌మ ప‌నుల‌ను తామే చేసుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ వేళ సెలూన్ షాప్ లు కూడా బంద్ అవ‌డంతో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పశ్వాన్ తన కుమారుడితో షేవ్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెలూన్లు మూసివేయడంతో తన కుమారుడు చిరాగ్ పశ్వాన్ తో తన హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకున్నట్లు చెప్పారు.

Latest Updates