కరెన్సీ నోట్లతో ముక్కు, నోరు తుడుచుకున్న వ్యక్తి అరెస్ట్

కరోనా వైరస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రపంచ దేశాల్ని కరోనావైరస్ ను అతలాకుతలం చేస్తున్నా కొంతమంది నెటిజన్లు వివాదంతో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.


మహరాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రూ.500నోట్ల కట్టను ముక్కు నోటితో తుడుచుకుంటూ ఓ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ అమెరికాకు చెందిన మీడియా సంస్థ ఫస్ట్ న్యూస్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. సదరు మీడియా సంస్థ పోస్ట్ చేసిన వీడియోలో నిందితుడు ఇండియన్ కరెన్సీ నోట్లను ముక్కు, నోటితో తుడుచుకోవడం స్పష్టం గా కనిపిస్తోంది. నిందితుడు వీడియోను పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
నాసిక్ చెందిన 40ఏళ్ల వ్యక్తి నోట్ల కట్టను ముక్కుతో నోటితో తుడుచుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కరోనాకు చికిత్స లేదు. ఇది ఒక వ్యాధి కాదు కాని మీకు అల్లా వేసిన శిక్ష అంటూ వీడియోలో చెప్పాడు.
ఆ వీడియో వైరల్ అవ్వడంతో అప్రమత్తమైన నాసిక్ పోలీసులు సైబర్ క్రైమ్ సాయంతో నిందితుణ్ని పట్టుకునేందుకు గాలింపులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాలెగావ్ లో ఉన్న నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153 మరియు 188 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates