ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని కరోనా పరీక్షిస్తోంది

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థ దృఢత్వం, బలానికి అతి పెద్ద పరీక్ష పెడుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం అన్నారు. కరోనా వైరస్ మన ఎకానమీ పటిష్టతకు పెద్ద పరీక్షను సూచిస్తోందని దాస్ చెప్పారు. 7వ ఎస్‌బీఐ బ్యాంకింగ్, ఎకనామిక్స్ కాన్‌క్లేవ్‌లో శక్తికాంత దాస్ మాట్లాడారు.

పాలసీ రెపో రేటును 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిందని తెలిపారు. అలాగే మరికొన్ని చర్యలు కూడా తీసుకోనున్నామని చెప్పారు. కరోనాతో ఏర్పడిన విపత్తులు. కష్టాలు, ప్రజల ప్రాణాలకు అపాయం కలగకుండా జీవనోపాధిని పెంచితే ఆర్థిక కార్యకలాపాలలో మార్పు వస్తుందన్నారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ చైన్ వ్యాల్యూస్, లేబర్, మూలధన కదలికలను ముంచెత్తిందని దాస్ పేర్కొన్నారు.

Latest Updates