బెంగళూరులో కలకలం: కరోనా రోగి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

బెంగళూరు: కరోనా బారిన పడి ట్రీట్​మెంట్ పొందుతున్న పేషెంట్ ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా సోకడంతో మనస్థాపం చెంది ఆస్పత్రి బిల్డింగ్ ఐదో ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడని అక్కడి పోలీసులు సోమవారం వెల్లడించారు. 50 ఏళ్ల వయసున్న అతను తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో శుక్రవారం కర్నాటక బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేరాడు. కిడ్నీ డిసీజ్​ తో బాధపడుతున్నాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రిపేర్ కోసం ఓపెన్ చేసి ఉన్న లిఫ్ట్ లోంచి పై ఫ్లోర్ కి వెళ్లి దూకాడని, ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించాయి. డెడ్ బాడీని అన్ని జాగ్రత్తలతో మార్చురీకి తరలించామని డాక్టర్లు వివరించారు. వైరస్ సోకిన వారికి ఆరోగ్య సేవలతో పాటు మానసిక ఒత్తిడి తగ్గేలా కౌన్సెలింగ్ కూడా అవసరమని వారు చెబుతున్నారు.

Latest Updates