కరోనా వైరస్ తగ్గింది: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేరళ విద్యార్ధిని

కేరళలో కరోనా సోకిన విద్యార్ధిని వ్యాధి నుంచి సురక్షితంగా భయటపడింది. కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలకు నిద్రపట్టకుండా చేస్తూ.. వేల సంఖ్యలో ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ . ఈ వైరస్‌ను కేరళ వైద్యులు జయించారు. చైనాలోని వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు… ఇటీవలే భారత్ తిరిగొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో వారికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో వారిని కేరళలో కాసర్ గోడ్ జిల్లా కన్హంగాడ్‌లో చికిత్స నందిస్తున్నారు. వారిలో వైరస్ సోకిన విద్యార్ధిని ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.  విద్యార్ధినికి నిర్వహించిన రెండు పరీక్షల్లో ప్రతీకూలంగా రిజల్ట్ వచ్చినట్లు, దీంతో విద్యార్ధిని డిశ్చార్జ్ చేసినట్లు కాసర్ గోడ్  జిల్లా వైద్య అధికారి ఇన్‌ఛార్జ్ డాక్టర్ రామ్‌దాస్ తెలిపారు. 18రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విద్యార్ధిని మరో పదిరోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలని, ఎలాంటి మెడిసిన్ అవసరం లేదని రామ్ దాస్ చెప్పారు.

Latest Updates