విడుదలైన 3వ దశ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ..95శాతం తగ్గిన వైరస్

కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. ఈ పోరులో కీలక విజయం సాధించినట్టు అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ ప్రకటించింది. వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ లో విజయవంతమైనట్టు ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కరోనా రాకుండా  95శాతం నియంత్రిస్తున్నట్లు ప్రకటించింది.  తొలిదశలో వ్యాక్సిన్ వేసుకున్న వాలంటీర్లలో 28 రోజుల తరువాత ఇమ్యూనిటీ పవర్ వచ్చినట్టు వివరణ ఇచ్చింది. అంతేకాదు ఈ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగం కింద అనుమతి లభించినట్లు సంతోషం వ్యక్తం చేసింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అవ్వడం మాకు చాలా గర్వంగా ఉందంటూ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Latest Updates