ఏపీలో మ‌రో 50 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా వైర‌స్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 50 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. ఒక పేషెంట్ మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 1980కి చేరింది. ఇందులో 45 మంది మ‌ర‌ణించ‌గా.. 925 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై ఆరోగ్య శాఖ ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 8666 టెస్టులు చేయ‌గా.. అందులో 50 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపింది. అలాగే కొత్త‌గా 38 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని చెప్పింది. క‌ర్నూలు నుంచి 21 మంది, గుంటూరులో 8 మంది, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావ‌రి జిల్లాలో, విశాఖ‌పట్నం జ‌ల్లాల్లో ఇద్ద‌రు చొప్పున, అనంత‌పురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క‌రు చొప్పున డిశ్చార్జ్ అయిన‌ట్లు తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌ర్నూలులో ఒక పేషెంట్ మ‌ర‌ణించార‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

జిల్లాల వారీగా క‌రోనా కేసుల వివ‌రాలు:

Coronavirus positive cases in AP increased to 1980

Latest Updates