చైనాలో కూలిన క్వారంటైన్ హోటల్

షాంఘై: చైనాలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ హోటల్ కూలిపోయింది. ఫూజియన్ ప్రావిన్స్ లోని క్వాంజౌ సిటీలో శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 70 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. రక్షణ చర్యలు ప్రారంభించిన అధికారులు 34 మందిని సేవ్ చేశారు. చైనాలో కరోనా విజృంభించడంతో స్థానికంగా ఉన్న ఓ హోటల్ ను క్వారంటైన్ గా మార్చారు. 80 రూములున్న ఈ హోటల్ కూలిపోవడానికి గల కారణాలు తెలియలేదు. ఫూజియన్ ప్రావిన్స్ లో శుక్రవారం వరకు 296  కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 10,819 మంది అనుమానితులను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

Latest Updates