కరోనా అనుమానంతో మూడో అంతస్తు నుంచి దూకేశాడు

కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో…జనం భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ తమకు వైరస్ సోకుతుందోనని..కొందరిలో భయం పెరిగిపోతోంది. జాగ్రత్తలు పాటిస్తూ..ధైర్యంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నప్పటికీ వణికిపోతున్నారు. ఏమాత్రం కొద్దిగా శరీరం వేడెక్కినా…దగ్గువచ్చినా..తమకు కూడా కరోనా వచ్చిందేమోనన్న భయంతో కొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే  ఢిల్లీలోని ఎయిమ్స్ లో జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ అపెక్స్ ట్రామా సెంట‌ర్‌లో ఓ వ్య‌క్తి త‌న‌కు క‌రోనా వ‌చ్చిందేమోన‌నే అనుమానంతో ఎయిమ్స్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. అయితే కాలు విరిగి…ప్రాణాలతో బయటపడ్డాడని డాక్టర్లు తెలిపారు.

రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలోని ఆస్పత్రిలో ఉన్న క్వారంటైన్‌ వార్డులో కరోనా లక్షణాలతో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Latest Updates