కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు

భారత్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనాను కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇళ్లలోనే క్వారంటైన్‌ గా ఉన్న కరోనా అనుమానితుల ఎడమ చేతిపై సిరాతో స్టాంపులను వేస్తోంది. ఆ స్టాంప్‌లో  వారి ఎప్పటి వరకు క్వారంటైన్‌లో ఉండాలనే సమాచారం కూడా ఉంది. ఇలా చేయడం ద్వారా కరోనా అనుమానితులను గుర్తించడం ఈజీ అవుతుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ  తెలిపింది.

ఎన్నికల సమయంలో ఓటర్ల వేలిపై ఎలానైతే సిరా చుక్క అంటించిన విధంగానే కరోనా అనుమానితుల చేతిపై చెరగని సిరాతో స్టాంప్‌ వేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గతంలో కొందరకు కరోనా అనుమానితులు ఆస్పత్రుల నుంచి పారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో ఉండటానికి ఇష్టపడని వారికోసం…ఎయిర్ పోర్టు సమీపంలోని హోటళ్లలో కూడా క్వారంటైన్ ఏర్పాట్లు చేసింది. అయితే వాటికి అయ్యే ఖర్చులను ఆయా వ్యక్తులే భరించాల్సిఉంటుందని తెలిపింది.

Latest Updates