శవం మీద 18 గంటల తర్వాత కూడా బతికున్న కరోనావైరస్

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనావైరస్.. ఏ రూపంలో, ఎంత సమయం ఉంటుందో తెలియకుండా పోయింది. తాజాగా కరోనాతో చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని 18 గంటల తర్వాత పరీక్షిస్తే అప్పటికీ కరోనావైరస్ సజీవంగానే ఉన్నట్లు తేలింది. ఆక్స్‌ఫర్డ్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో చనిపోయిన ఒక వ్యక్తికి 18 గంటల తర్వాత కరోనా పరీక్ష చేశారు. ఆ వ్యక్తి యొక్క ముక్కు, గొంతు, నోరు, లంగ్స్, ముఖం, మెడ, శ్వాసకోసం నుంచి వైరస్ నమూనాలను తీసుకొని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినట్లు ఫోరెన్సిక్ నిపుణుడు దినేష్ రావు తెలిపారు. అయితే ముక్కు మరియు గొంతు తీసుకున్న నమూనాలు కరోనా పాజిటివ్‌గా చూపించాయని ఆయన తెలిపారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యాయని ఆయన చెప్పారు. వైరస్ ప్రభావంతో రోగి యొక్క ఊపిరితిత్తులు మందంగా మారి బరువు పెరిగాయని ఆయన తెలిపారు. ఊపిరితిత్తులు సాధారణంగా 700 గ్రాముల బరువు కలిగివుంటాయి. కానీ, బాధితుడి ఊపిరితిత్తుల బరువు 2.1 కిలోల కంటే ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఊపిరితిత్తులు రబ్బరు బెలూన్ లాగా ఉండాలి కానీ తోలు బంతిలా మారిపోయాయని డాక్టర్ రావు తెలిపారు. రోగి యొక్క ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టి.. ఎయిర్ బ్యాగ్స్ దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ఇటువంటి సమయంలో రోగిని వెంటిలేటర్ మీద పెట్టాలని, దానికంటే ముందు రోగికి థ్రోంబోలిటిక్ థెరపీ చేయాలని ఆయన తెలిపారు.

డాక్టర్ రావు మాట్లాడుతూ.. అమెరికా మరియు ఇటలీ దేశాలలో కోవిడ్ -19 రోగులపై చేసిన శవపరీక్షల ఫలితాలతో పోలిస్తే తన పరిశోధనలు ప్రత్యేకమైనవని ఆయన అన్నారు. తన పరిశోధనలు వైరస్ యొక్క జాతులు భిన్నంగా ఉన్నట్లు సూచిస్తున్నాయని తెలిపారు.

For More News..

భర్తకు భరణం చెల్లించాలని భార్యకు కోర్టు ఆదేశాలు

పండక్కి ఊరెళ్తుండగా ప్రమాదం.. తల్లీకొడుకు మృతి

ఫెస్టివల్​ షాపింగంతా ఆన్​లైన్​లోనే

తెలంగాణలో కొత్తగా 1,421 కరోనా కేసులు

Latest Updates