ఢిల్లీలో పరిస్థితి కంట్రోల్‌లోనే ఉంది: అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కంట్రోల్‌లో ఉందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. జూన్‌ చివరి నాటికి 60వేల కేసులు వస్తాని అంచనా వేశామని, కానీ 26వేల కేసులే వచ్చాయని ఆయన చెప్పారు.రోజు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా వారం రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. 4వేల కౌంట్‌ నుంచి 2500కి తగ్గిందని చెప్పారు. గత 24 గంటల్లో 2,199 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య 87,360కి చేరుకుంది. ఒక్క రోజులో 62 మంది చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 2742కి చేరింది. యాక్టివ్‌ కేసులు 26,270కి చేరింది. గత వారం రోజుల నుంచి డైలీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. “ ఢిల్లీలో టెస్టులు పెంచాం. అందుకే కేసుల సంఖ్య తగ్గుతోంది. గతంలో 100 మందికి టెస్టులు చేస్తే 30 మందికి వైరస్‌ ఉంటోంది. ఇప్పుడు 100 మందికి చేస్తే 13 మందికి పాజిటివ్‌ వస్తోంది” అని కేజ్రీవాల్‌ అన్నారు. రికవరీ రేటు కూడా 60 నుంచి 66 శాతానికి పెరిగింది. డెత్‌రేట్‌ 3 శాతంగా ఉంది అని కేజ్రీవాల్‌ చెప్పారు. ఢిల్లీలో రోజుకు 16 వేల నుంచి 21వేల టెస్టులు చేస్తున్నారు.

Latest Updates