డిసెంబర్​లోనే ఇటలీలో కరోనా?

రోమ్​: ఇటలీలోని రెండు పెద్ద సిటీల్లో గతేడాది డిసెంబర్​లోనే కరోనా ఉందట. తొలి కేసు నమోదవడానికి రెండు నెలల ముందుగానే అక్కడ వైరస్​ ఆనవాళ్లు ఉన్నాయట. వేస్ట్​ వాటర్​పై ఇటలీ నేషనల్ హెల్త్​ ఇనిస్టిట్యూట్​ చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. మిలాన్​, టురిన్​ ప్రాంతాల్లో డిసెంబర్​ చివరిలో సేకరించిన వేస్ట్​ వాటర్​ శాంపిల్స్​లో సార్స్​ కోవ్​ 2 జెనెటిక్​ ట్రేసెస్​ ఉన్నట్టు రీసెర్చర్లు గుర్తించారు. అలాగే బోలోగ్నా సిటీలో జనవరిలో సేకరించిన శాంపిల్స్​లో కూడా వైరస్​ మూలాలు బయటపడ్డాయని ఐఎస్ఎస్​ ఇనిస్టిట్యూట్​ శుక్రవారం రిలీజ్ చేసిన స్టేట్​మెంట్​లో పేర్కొంది. నిజానికి ఇటలీలో తొలి కరోనా కేసు ఫిబ్రవరి మధ్యలో నమోదయ్యింది. కానీ తాజా స్టడీ ప్రకారం డిసెంబర్​లోనే వైరస్​ మూలాలు కనిపించాయని తేలింది. ఈ రిజల్ట్స్​ ఆధారంగా ఇటలీలో కరోనా వైరస్​ వ్యాప్తి ఎక్కడి నుంచి మొదలైందనే విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ఐఎస్​ఎస్ పేర్కొంది. ఎర్లీ డిటెక్షన్​ టూల్​ ద్వారా మురుగునీటి నమూనాలను వ్యూహాత్మకంగా పరిశీలించామని, వీటిని ఇప్పుడు కన్సాలిడేటెడ్​ ఇంటర్నేషనల్​ ఎవిడెన్స్​గా పరిగణించవచ్చని తెలిపింది.

యూరోప్​లో తొలి దేశం

కరోనా వైరస్​ బారిన పడిన తొలి యూరోపియన్​ దేశం ఇటలీనే. ఆ దేశంలో ఫిబ్రవరిలో తొలి కరోనా కేసు నమోదైంది. దానిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ప్రకటించిన మొట్టమొదటి దేశం కూడా అదే. చైనా టూరిస్టులు కాకుండా ఇటలీలో కేసు లాంబార్డీ రీజియన్​లోని కోడోగ్నో టౌన్​లో మొదటి కరోనా పేషెంట్​ను గుర్తించారు. ఫిబ్రవరి 21న ఇటలీ ప్రభుత్వం కోడోగ్నో టౌన్​ను రెడ్​ జోన్​గా ప్రకటించింది. ఆ తర్వాత లాంబార్డీ రీజియన్​లోని మిగతా టౌన్లు, సిటీలకు కూడా రెడ్​ జోన్​ను విస్తరించింది. మార్చి మొదటి వారంలో దేశవ్యాప్తంగా షట్​డౌన్​ను అమలులోకి తెచ్చింది. ఇటలీలో ఇప్పటి వరకూ 34 వేలమందికి పైగా కరోనాతో మరణించారు.

ఎర్లీ వార్నింగ్​ సిస్టం

ఐఎస్​ఎస్ వాటర్​ క్వాలిటీ ఎక్స్​పర్ట్​ గుసెప్పినా లా రోసా. ఆమె టీమ్​ 2019 అక్టోబర్​ నుంచి 2020 ఫిబ్రవరి వరకూ 40 వేస్ట్​ వాటర్​ శాంపిల్స్​ను పరీక్షించింది. రెండు వేర్వేరు విధానాల ద్వారా రెండు డిఫరెంట్​ ల్యాబోరేటరీల్లో చేసిన టెస్టుల్లో మిలాన్, టురిన్​ ల్లో డిసెంబర్​ 18న, బోలోగ్నాలో జనవరి 29న సేకరించిన శాంపిల్స్​లో సార్స్ కోవ్​ 2 వైరస్​ ఉన్నట్టు నిర్థారణ అయ్యిందని చెప్పారు. అక్టోబర్​, నవంబర్​లో తీసిన శాంపిల్స్​లో మాత్రం వైరస్​ నెగెటివ్​ వచ్చిందని, అప్పటికి వైరస్​ రాలేదని లా రోసా చెప్పారు. ఫ్రాన్స్‌‌లో ఆస్పత్రిలో చేరిన పేషెంట్ల శాంపిల్స్​ను ఎనలైజ్​ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్​ ఆధారంగా ఈ డేటాను కన్ఫామ్​ చేశారు. ఇది డిసెంబర్​ చివరి నాటి సార్స్​ కోవ్​ 2 పాజిటివ్​ కేసులకు అనుకూలమైనదిగా ఆ ఇనిస్టిట్యూట్​ పేర్కొంది. స్పెయిన్​ తాజా స్టడీలో బార్సిలోనాలో జనవరిలో కలెక్ట్​ చేసిన వేస్ట్​ వాటర్​ శాంపిల్స్​ జెనెటిక్​ ట్రేసెస్​ ఉన్నట్టు తేలింది. స్పెయిన్​లో తొలి కేసు నమోదవడానికి 40 రోజుల ముందే అక్కడ్​ వైరస్​ మూలాలు ఉన్నట్టు బయటపడింది.

మెజారిటీ కేసుల్లో నో సింప్టమ్స్​

కరోనా మహమ్మారి మొదలైన కొత్తలో వైరస్​ వ్యాప్తిని తెలుసుకునేందుకు వేస్ట్​ వాటర్​లో జెనెటిక్​ ట్రేసెస్​ ఉన్నాయో లేదో రీసెర్చర్లు టెస్టులు చేశారు. బ్రిస్బేన్​ మొదలుకుని పారిస్, ఆమ్​స్టర్​డ్యామ్​ వరకూ ఇదే పద్ధతిని అనుసరించారు. రికార్డవుతున్న కరోనా కేసుల్లో మెజారిటీ శాతం తక్కువ లేదా అసలు సింప్టమ్స్ లేకపోవడమే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల వేస్ట్​ వాటర్​ను టెస్ట్​ చేయడం ద్వారా వైరస్​ ఉందో లేదో తెలుసుకోవడానికి రీసెర్చర్లు.. వైరస్​ బయటపడని, తొలి కేసులు అప్పుడే నమోదైన ప్రాంతాల్లో ఈ రకమైన టెస్టులు చేసేవారు. సీవర్స్, ప్యూరిఫికేషన్​ ప్లాంట్లలో రెగ్యులర్​గా శాంపిల్స్​ కలెక్ట్​ చేయాలని ఇటలీ హెల్త్​ మినిస్ట్రీని ఐఎస్ఎస్​ సూచించింది.

రోహిత్ ను ఆపడం ఎవరితరం కాదు

Latest Updates