పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలె: డబ్ల్యూహెచ్​వో

జెనీవా: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో) కొత్త సూచన చేసింది. ఓపెన్‌ ప్లేసుల్లో ఉన్నప్పుడు జనాలు మాస్క్ కంపల్సరీ వేసుకోవాలని సూచించింది. కరోనాను కట్టడి చేయాలంటే ఈ సూచన తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. దీనిపై డబ్ల్యూహెచ్​వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ శనివారం వీడియో మెస్సేజ్ రిలీజ్ చేశారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చాయని ఆయన గుర్తుచేశారు. తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్నదని, ముఖ్యంగా 60 ఏండ్లకు పైబడిని వారు మెడికల్ మాస్కును తప్పనిసరిగా వాడాలని చెప్పారు. మెడికల్ మాస్కులు అందుబాటులో లేని సాధారణ ప్రజలు మూడు లేయర్ల ఫ్యాబ్రిక్ మాస్క్ ను వాడాలని సూచించారు. పబ్లిక్ ప్లేసులు, మాల్స్, దుకాణాల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు వాడేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సూచించారు. కేవలం మాస్కులు మాత్రమే కరోనా నుంచి ప్రజల్ని కాపడలేవు, హెల్దీగా ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని తాము చెప్పలేమని గతంలో కామెంట్ చేసిన డబ్ల్యూహెచ్​వో తాజాగా తన కామెంట్ ను సరిచేసుకుంది. ఇటీవలి వారాల్లో చేసిన అధ్యయనాల ద్వారా కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నట్లు పేర్కొంది.

Latest Updates