మహిళల గోల్ఫ్ లీగ్: విజేతలకు టాయిలెట్ పేపర్

కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్ డైన్ ప్రకటించాయి. దీంతో నిత్యావసర వస్తువులతో పాటు ఇతర వస్తువులకు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా విదేశాల్లో టాయిలెట్ పేపర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎంతలా అంటే ఆ పేపర్లను గిప్టుగా ఇచ్చేంతగా పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో  మహిళల గోల్ఫ్ లీగ్ జరుగుతోంది. అయితే అందులో గెలిచిన విజేతలకు నగదుతో పాటు అదనంగా టాయిలెట్ పేపర్ రోల్ ను కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారు నిర్వాహకులు.

ఒకవైపు కరోనా కలకలం రేపుతున్నప్పటికీ అరిజోనా క్లబ్‌లో ఆరంభమైన ఈ లీగ్‌లో ముందస్తు జాగ్రత్తలతో పోటీలను నిర్వహిస్తున్నారు. గత వారం జరిగిన ఈ పోటీలో విజేతగా నిలిచిన సారాకు టాయిలెట్ పేపర్ ను బహుమతిగా ఇచ్చారు. ఈ గిఫ్ట్ ను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది సారా.

Latest Updates