మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌శౌరిపై అవినీతి కేసు నమోదు

మాజీ కేంద్ర మంత్రి, ఆర్థికవేత్త, జర్నలిస్ట్‌ అరుణ్‌శౌరిపై సీబీఐ స్పెషల్ కోర్టు అవినీతి కేసు నమోదు చేసింది. రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌లో లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌ హోటల్‌లో పెట్టుబడులు పెట్టారన్న అక్రమ కేసులో మాజీ మంత్రి అరుణ్‌శౌరిని నిందితుడిగా పేర్కొంది. అరుణ్‌శౌరితో పాటు మాజీ ప్రభుత్వ అధికారి ప్రదీప్‌ బైజాల్‌, జ్యోత్న శౌరిలను కూడా నిందితులుగా తెలిపింది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల మంత్రిగా పనిచేసిన అరుణ్‌శౌరి హోటల్స్‌ అమ్మకంలో అవతవకలకు పాల్పడ్డారని, భారీ నష్టం వచ్చినట్లుగా ప్రభుత్వానికి లెక్కలుచూపారని కోర్టు చెప్పింది. హోటల్స్‌ అమ్మకాన్ని తిరిగి ప్రారంభించాలని ఆదేశించినపుడు  ఆ అవినీతి బయటపడిందని తెలిపింది. హోటల్‌ లక్ష్మీ విలాస్‌ ధర రూ. 252 కోట్లు కాగా, కేవలం రూ. 7.5 కోట్లకు సేల్ చేసినట్లు కోర్టు చెప్పింది.

2019లో ఈ కేసును సాక్ష్యాధారాలు లేవంటూ సీబీఐ కేసును కొట్టివేసింది. అయితే ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టాలంటూ జోద్‌పూర్‌ ప్రత్యేక కోర్టు ఆదేశించింది.

Latest Updates