పత్తి కొనుగోలు మిల్లు దగ్గర రైతు మృతి..అలసిపోయి పడుకుంటే..!

షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా కేశం పేట మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కేశంపేట మండల పరిధిలోని వేములనర్వ గ్రామంలోని గాయత్రీ కాటన్ మిల్లులో పార్కింగ్ వద్ద ప్రమాదవశాత్తు ఓ రైతు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే కొడ్గల్ గ్రామానికి చెందిన పత్తి రైతు బాలయ్య గాయత్రి కాటన్ మిల్లులో  పత్తి అమ్మడానికి వచ్చాడు. పగలంతా ఎండలో ఉంటూ పత్తి అమ్మేందుకు లైన్లోనో ఉన్నాడు. రాత్రి అయినా తన వరుస నెంబర్ రాలేదు. దీంతో అలసిపోయిన రైతు రాత్రి వరకు అక్కడే ఉన్నాడు. మిల్లు దగ్గర షెల్టర్ కానీ.. రైతులు పడుకునేందుకు గదులు లేకపోవడంతో అక్కడే ఉన్న డీసీఎం కింద నిద్రించాడు.

అయితే రైతు వాహనం క్రింద నిద్రిస్తున్న సమయంలో డ్రైవర్ ఉదయం గమనించకుండా బండిని ముందుకు తీశాడు. దీంతో రైతు అక్కడిక్కకడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పత్తి కాటన్ మిల్లు దగ్గర రైతులకు కనీస వసుతులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తిరైతులు. తాగునీరు, టాయిలెట్స్, పడుకోవడానికి గదులు లేవని చెబుతున్నారు.

Latest Updates