అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య

ఉట్నూరు, వెలుగు: అప్పుల బాధతో ఓ గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్​జిల్లా పాత ఉట్నూరు నాగిరెడ్డి నగర్​లో ఉంటున్న జాదవ్​తాతేరావ్(59) మూడెకరాలతోపాటు అదనంగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. పెట్టుబడుల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశాడు.

ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలోనని ఆందోళనకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సర్కార్​హాస్పిటల్​కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్​లోని రిమ్స్​కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్​లో మృతిచెందాడు.

Latest Updates