వర్ష సూచనతో కొనుగోళ్లు వాయిదా..ఆందోళనలో పత్తి రైతులు

ఆదిలాబాద్ జిల్లాలో 19న పత్తి కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉండగా.. వర్ష సూచనతో కొనుగోళ్లు వాయిదా వేశారు. దీంతో గ్రామాల్లో పత్తిని ఆరబెట్టుకుంటున్నారు రైతులు. ప్రస్తుతం ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులు ఆందోళనలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈసారి పత్తి సాగుకు ఖర్చులు ఎక్కువయ్యాయంటున్నారు అన్నదాతలు. ఆశించిన స్థాయిలో దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు.

Latest Updates