వావ్ కోట్రెల్: మిరాకిల్ క్యాచ్ తో మెస్మరైజ్..

cottrail-takes-stunning-catch-to-dismiss-steve-smith

నాటింగ్ హామ్ లో గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో విండీస్ ప్లేయర్ కోట్రెల్ …మిరాకిల్ క్యాచ్ తో మెస్మరైజ్ చేశాడు. కరీబియన్ బౌలర్ థామస్ వేసిన ఓవర్ లో… ఆసీస్ మాజీ కెప్టెన్ , బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్.. లెగ్ సైడ్ మీదుగా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోట్రెల్.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే రీతిలో బాల్ ను అందుకున్నాడు. పరుగెత్తుకుంటూ  బౌండరీ లైన్ ఇవతల బంతిని క్యాచ్ చేశాడు. బౌండరీ లైన్ దాటుతున్నానని తెలిసి బాల్ ను పైకి విసిరాడు. మళ్లీ లైన్ ఇవతలికి వచ్చి.. బంతిని అందుకున్నాడు.  ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇప్పుడు ఈ క్యాచ్ వైరల్ గా మారింది.

Latest Updates