నేను ఓడిపోతే ఏమవుతుందో ఊహించగలరా?

మకాన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ట్రంప్, బిడెన్ ప్రచార జోరు పెంచారు. బిడెన్‌‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఫ్లోరిడా, జార్జియాలో బిడెన్ నిర్వహించిన ప్రచార ర్యాలీలు కమ్యూనిజంను పెంచే విధంగా ఉన్నాయని ట్రంప్ విమర్శించారు. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ హిస్టరీలో అత్యంత చెత్త అభ్యర్థితో తలపడటం తనపై ఒత్తిడి పెంచుతోందని ట్రంప్ వ్యంగ్యంగా చెప్పారు. ఒకవేళ తాను ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా అంటూ మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. ఓడిపోతే తాను దేశాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుందేమోనన్నారు.

Latest Updates