లగ్గానికి ముందు కౌన్సెలింగ్ మేలు

రోజుల్లో చాలా జంటలు పెళ్లైన కొద్ది రోజులకే విడిపోతున్నాయి. పెళ్లికి ముందు ఊహించుకున్న లైఫ్‌‌‌‌, పెళ్లి తర్వాత కనిపించకపోవడం, సరైన పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ దొరక్కపోవడం, ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్‌‌‌‌ రీచ్‌‌‌‌ కాలేకపోవడం, అభిప్రాయాల్లో తేడాలు ఉండడం వల్ల త్వరగా విడిపోతున్నాయి జంటలు. ఇలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే ముందు గానే అంటే పెండ్లికి ముందుగానే కౌన్సెలింగ్‌‌‌‌ తీసుకోవడం బెటర్‌‌‌‌‌‌‌‌.

చిన్నప్పట్నుంచి ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్లు పెళ్లి చేసుకుంటే పర్లేదు. కానీ, అంతకు ముందు ఏ పరిచయం లేని ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్‌‌‌‌ వస్తున్నాయి. దీంతో చాలామంది పెళ్లయ్యాక కొద్దిరోజులకే కలిసుండలేక విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయంలో పెళ్లికిముందే ఇద్దరూ కలిసి కౌన్సెలింగ్‌‌‌‌ తీసుకోవాలి. నిపుణులైన కౌన్సెలర్స్‌‌‌‌ లేదా ఫ్యామిలీ థెరపిస్ట్‌‌‌‌లు ఈ కౌన్సెలింగ్‌‌‌‌ ఇస్తారు.

వేరువేరు బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చిన వాళ్లు, ఆర్థిక పరిస్థితుల్లో తేడా ఉన్నవాళ్లు, ప్రాంతాలకు చెందిన వాళ్లు పెళ్లి చేసుకోవాలంటే ప్రీ మారిటల్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌ తీసుకోవాలి.

అలానే, కోరుకున్న టైమ్‌‌‌‌కంటే ముందుగానే లేదా కెరీర్‌‌‌‌‌‌‌‌లో సెటిల్‌‌‌‌ కాకుండానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు కౌన్సెలింగ్‌‌‌‌ తీసుకోవాలి.

కాబోయే భార్యాభర్తలు, ఇద్దరూ ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునేందుకు, ఒకరి ఆలోచనల్ని, ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌ను మరొకరితో షేర్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు కౌన్సెలింగ్‌ ఉపయోగపడుతుంది.

పెండ్లి తర్వాత ఎదుటి వ్యక్తి నుంచి ఏం ఆశిస్తున్నారో, ఎవరి బాధ్యత, పరిధి ఏంటో తెలుసుకునేందుకు ఇది హెల్ప్‌‌‌‌ అవుతుంది.

ఒకరిమీద మరొకరికి ఉన్న అనుమానాల్ని పోగొట్టుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్‌‌‌‌, గోల్స్‌‌‌‌, బౌండరీస్‌‌‌‌, రెస్పాన్సిబిలిటీస్‌‌‌‌, కెరీర్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్సియల్‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌, చిల్డ్రన్‌‌‌‌, పాస్ట్‌‌‌‌ రిలేషన్స్‌‌‌‌ వంటి అంశాల్ని డిస్కస్‌‌‌‌ చేయొచ్చు.

అన్నింటిని గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ తనకు సరిపోతారా? లేదా? అని ఒక అంచనాకు రావొచ్చు. ఇద్దరిమధ్యా సరైన బంధాన్ని ఏర్పర్చుకునేందుకు, లైఫ్‌‌‌‌ను హ్యాపీగా మలుచుకునేందుకు ప్రీమారిటల్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌ హెల్ప్‌‌‌‌ అవుతుంది.

Latest Updates