విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి : మంత్రి సబిత

ఆత్మహత్యలకు పాల్పడవద్దని ప్రతీ కాలేజీలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. హైదరాబాద్ లో స్టూడెంట్ కౌన్సిలర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఆమె ప్రారంభించారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ప్రైవేట్ కాలేజీలకు కూడా గైడెన్స్ ఇవ్వాలన్నారు. త్వరలో ప్రైవేట్ కాలేజీలతో సమావేశమవుతామన్నారు. పిల్లలకు ఇంటర్ స్టేజ్ లో సరైన గైడెన్స్ ఇవ్వాలన్నారు. కుటుంబ సమస్యలున్నా వారికి ధైర్యం చెప్పాలన్నారు మంత్రి సబిత.

Latest Updates