డయాబెటిస్‌‌‌‌కి కౌంట్‌‌డౌన్‌‌

షుగర్‌‌ పేషెంట్స్‌‌ కోసం eddii అనే ఒక యాప్‌‌ వచ్చింది. ఇది ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ ఆధారంగా పనిచేస్తది. మొన్ననే లాంచ్‌‌ చేసిన ఈ యాప్‌‌ ఈ రోజు నుంచి పనిచేస్తది. ఈ యాప్‌‌ ద్వారా బ్లడ్‌‌ షుగర్‌‌ లెవెల్స్‌‌, డైట్‌‌, వెయిట్‌‌, వర్కవుట్స్‌‌ వివరాలన్నిటినీ ట్రాక్‌‌ చేస్తది. పేషెంట్‌‌ తీసుకోవాల్సిన కార్బొహైడ్రేట్స్‌‌, ఇన్సులిన్‌‌ వివరాలను ఈ యాప్‌‌ లెక్కగట్టి చెబుతుంది. ప్రతి రోజూ శరీరంలో ఉండే మార్పు, బీపీ, కళ్లు తిరగడం, తలనొప్పి, దప్పిక, అతిమూత్రం మొదలైన వివరాలన్నిటినీ ఇందులో ఫీడ్‌‌ చేసుకోవచ్చు.

ఈ యాప్‌‌ డయాబెటిస్‌‌ని కంట్రోల్‌‌ చేసుకోవడానికి లైఫ్‌‌ స్టైల్‌‌లో ఏఏ మార్పులు చేసుకోవాలె? ఆహారపు అవాట్లను ఎలా నియంత్రించుకోవాలో ఎడ్యుకేట్‌‌ చేస్తదని eddii ఫౌండర్‌‌ ఫర్హానా అహ్మది అంటున్నడు. వారంలో, నెలలో, ఏడాదిలో ఆరోగ్య సమస్యలు, వ్యాయామం, ఆహారం, బాడీ వెయిట్‌‌లో వచ్చిన మార్పులు, ఇతర సమస్యలను ట్రాక్‌‌ చేసి గ్రాఫ్‌‌లు, టేబుల్స్‌‌ రూపంలో ఇవ్వడం కోసం ఈ యాప్‌‌ రూపకల్పనలో ఇంజినీర్లతోపాటు ఆర్టిస్టులను కూడా ఉపయోగించుకున్నరట. సులభంగా అర్థమయ్యేలా బొమ్మలు గీసి పేషెంట్ స్టేటస్‌‌ చెబుతరు.

అంతే ఈజీగా అర్థమయ్యేలా ఏమేం చేయాల్సి ఉంటదో మంచి బొమ్మలు గీసి చెబుతరు. ఒక్కో డాక్టరు ఒక్కో తీరుగ చెబుతుంటే పేషెంట్స్‌‌ ఫాలో కాలేక కన్య్ఫ్యూజ్‌‌ అయితరు. అందుకని ఈ యాప్‌‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌ఓ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నరు.

Latest Updates