కరోనా ఎఫెక్ట్: బోర్డర్లు క్లోజ్ చేసుకుంటున్న దేశాలు

  • ఇండియావి 18 బోర్డర్‌ రూట్లు క్లోజ్‌
  • యూరప్‌ నుంచి వచ్చేటోళ్లపై యూఎస్‌ ఆంక్షలు
  • క్రూయిజ్‌ షిప్‌ లపై న్యూజిలాండ్‌ బ్యా న్‌
  • చాలా దేశాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ కూడా బంద్‌
  • చైనా తప్ప అన్ని దేశాల్లో యాపిల్‌‌‌‌‌‌‌‌ స్టో ర్లు క్లోజ్‌

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి తిప్పలు పెడుతోంది.చైనాల మొదలైన రోగం.. ఆ దేశం అవతల విజృంభిస్తోంది. దేశాలకు దేశాలనే భయపెట్టిస్తోంది. యూరప్‌ నైతే వణికిస్తోంది. రోగం దెబ్బకు ప్రపంచ దేశాలు బోర్డర్లను బంద్‌ జేసుకుంటున్నాయి. స్పోర్ట్స్‌ ఈవెంట్లను క్యాన్సిల్‌ చేస్తున్నాయి. షాపింగ్‌ మాల్స్‌‌‌‌‌‌‌‌, మ్యూజియంలు, టూరిస్టు ప్రదేశాలు, సినిమా థియేటర్లను మూసేస్తున్నాయి. పబ్లిక్‌ మీటింగ్‌ లు వద్దంటున్నయి.అవసరమైతెనే బయటకు పొమ్మంటున్నయి.

18 ఇండియా బోర్డర్‌ రూట్లు క్లోజ్‌

కరోనా కట్టడిలో భాగంగా బోర్డర్‌‌‌‌‌‌‌‌ రూట్లను ఇండియా మూసేస్తోంది. 37 బోర్డర్‌‌‌‌‌‌‌‌ చెక్‌ పోస్టుల్లో 19 దారుల్లో జనాన్ని అనుమతిస్తామని, శనివారం అర్ధరాత్రి నుంచి ఇది అమలవుతుందని కేంద్రం వెల్లడించింది. ఇండో–నేపాల్‌ బోర్డర్లలో నాలుగే తెరిచి ఉంటాయంది. నేపాల్‌ , భూటాన్‌ ప్రజలకు వీసా ఫ్రీ ఎంట్రీ మాత్రం ఉంటుందని చెప్పింది. కర్తార్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ కారిడార్‌‌‌‌‌‌‌‌ను మూసేసే విషయాన్ని చర్చిస్తోంది. మరోవైపు భూటాన్‌ తో స్టేట్‌ బోర్డర్‌‌‌‌‌‌‌‌ను పశ్చిమబెంగాల్‌ మూసేసింది. బోర్డర్‌‌‌‌‌‌‌‌ ద్వారా టూరిస్టు, బిజినెస్‌ కార్యకలాపాలు ఉండవంది. బంగ్లాదేశ్‌ కు నడిచే ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ ట్రైన్లు, బస్సులు ఏప్రిల్‌ 15 వరకు ఆపేస్తున్నా మని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఎంప్లాయ్‌ మెంట్‌ ,డిప్లొమాటి క్‌ వీసాలు తప్ప మిగిలిన వీసాలనూ ఆపేసింది. ఇతర దేశాల నుంచి వచ్చే ఇండియన్‌ ప్యాసింజర్లు ప్రభుత్వ సూచనల ప్రకారం నడుచుకోవాలంది. భూటాన్‌ కు వెళ్లిన అమెరికా టూరిస్టుకు కరోనా పాజిటివ్‌ రావడంతో విదేశీయులపై ఆ దేశం కూడా బ్యాన్ విధించిం ది.

యూఎస్‌ ఆంక్షలు షురూ

యూరప్‌ నుంచి వచ్చే వాళ్లపై శుక్రవారం అర్ధరాత్రి నుంచి బ్యాన్‌ విధిస్తు న్నట్టు అమెరికా ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే అంతర్జా తీయంగా ప్రయాణాలను యూఎస్‌ మిలిటరీ రద్దు చేసుకుంది. తాజాగా వాళ్ల దేశంలోనూ డొమెస్టిక్ ప్రయాణాలుండవంది. రోగులు పైసలకు ఇబ్బంది పడకుండా పెయిడ్‌ సిక్‌ లీవ్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేలా యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌‌‌‌‌‌‌‌ నిర్ణయంతీసుకుంది. టెస్టులు కూడా ఫ్రీగా చేయించనున్నట్టు పేర్కొంది.

జూన్‌ 30 వరకు షిప్‌ లు రావొద్దు: న్యూజిలాండ్‌

క్రూయిజ్‌ షిప్‌ ల వల్ల కొన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువవడంతో తమ దేశానికి అలాంటి షిప్‌ లు జూన్‌ 30 వరకు రావొద్దని న్యూజిలాం డ్‌ ప్రధాని జసిండ్రా ఆర్డెన్‌ ఆదేశాలిచ్చా రు. ఇజ్రాయెల్‌ సహా చిన్న చిన్న పసిఫిక్‌ దేశాలు తమ బోర్డర్లను ఇప్పటికే క్లోజ్‌ చేశాయని, పెద్ద దేశమైన తామూ తమ ప్రజల కోసం ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని జసిండ్రా చెప్పారు. ప్రస్తుతం దేశంలో 6 కరోనా కేసులే నమోదైనా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

బ్రిటన్‌ లో వచ్చే వారం నుంచి..

యూరప్‌ , బ్రిటన్‌ , ఐర్లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులు 2 వారాలు క్వారంటైన్‌ లో ఉండాలని తైవాన్‌ ఆదేశాలిచ్చింది. వెనెజులాతో బోర్డర్‌‌‌‌‌‌‌‌ను మూసేస్తున్నట్టు కొలంబియా ప్రకటించింది. యూరప్‌ , ఆసియా నుంచి వచ్చే విజిటర్లను ఆపేస్తామంది. 500లకు మించి జనాలు పోగయ్యే పబ్లిక్‌ ఈవెంట్లపై చిలీ ప్రెసిడెంట్‌ సెబాస్ టి యన్‌ పినెరా బ్యాన్‌ విధించారు. ఆస్ట్రేలియాలో ఇలాంటి ఆంక్షలు సోమవారం నుంచి అమలు కానున్నాయి. బ్రిటన్‌ లోనూ వచ్చే వారంలో ఎమర్జెన్సీ చట్టాలు రాబోతున్నాయని అక్కడి అధికారులు చెప్పారు.

రెస్టా రెంట్లు,మాల్స్‌ బంద్‌

చాలా వరకు షాప్‌ లు, రెస్టారెంట్లను శనివారం ఉదయం నుంచే మూసేయాలని చెక్‌ రిపబ్లిక్‌ ఆదేశాలిచ్చింది. గ్యాస్‌ స్టేషన్లు, ఫుడ్‌ స్టోర్లు , ఫార్మసీలు మాత్రం తెరిచి ఉంచొచ్చంది. పారిస్‌ లో ఈఫిల్‌ టవర్‌‌‌‌‌‌‌‌, లౌరే మ్యూజియం, మౌలిన్‌ రోగ్‌ క్యాబరేను మూసేశారు.న్యూ యార్క్‌‌‌‌‌‌‌‌లోని బ్రాడ్‌ వే థియేటర్లను క్లోజ్‌ చేశారు.ఐర్లాండ్‌ లో కిస్సింగ్‌ స్టోన్‌ పర్యాటక ప్రదేశాన్నీ మూసేశారు. ట్రావెల్‌ బ్యాన్లతో రవాణా సేవలందించే ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ సహా ఇతర సంస్థ నష్టాల్లో మునిగిపోయాయి. షేర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు కూడా కుప్పకూలిపోతున్నాయి. రోజు వారీ పనులపైనా ప్రభావం కనబడుతోంది.

Latest Updates