దేశం నియంత పాలన వైపు సాగుతోంది: రాహుల్

మన దేశం ప్రస్తుతం నియంత పాలన వైపు అడుగులేస్తుందని అన్నారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.  వయనాడ్‌ నియోజవర్గంలోని.. బండీపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో రాత్రివేళ ట్రాఫిక్‌ను నిషేదించడాన్ని ఖండించారు. అందుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు తెలిపారు.

అంతేకాదు ప్రధాని మోడీపై ఎవరు విమర్శలు చేసినా జైలుకెళ్లడం ఖాయమన్నారు రాహుల్. మూక దాడులకు సంబంధించి ప్రధానికి లేఖ రాసిన 50 మంది ప్రముఖలపై రాజద్రోహం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాహుల్‌… ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారిపై ఏదో రకంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మీడియా స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందరికి తెలుసని.. ఇందులో ఏ మాత్రం రహస్యం లేదని పరోక్షంగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు రాహుల్.

Latest Updates