నకిలీ నెక్లెస్ తాకట్టు పెట్టి రూ.65 వేలతో పరారైన జంట

సికింద్రాబాద్: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి 65వేల నగదుతో ఓ జంట పరారైన ఘటన తుకారాంగేట్ పీఎస్ పరిధిలో జరిగింది. తుకారంగేట్ పీఎస్ ఇన్స్‌పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం స్థానిక రియో పాయింట్ హోటల్ సమీపంలో ఉన్న గాయత్రి జ్యూవెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్  షాప్ కి   ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. తమకు అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయని చెప్పి వారి దగ్గరున్న  3తులాల నెక్లెస్ ను తాకట్టు పెట్టారు. అది బంగారు నెక్లెస్ అని నమ్మిన షాపు యజమానికి వారికి 65వేల రూపాయలు ఇచ్చారు.  ఆ తర్వాతి రోజు ఉదయం ఆ నెక్లెస్ నకిలీదని గుర్తించిన  షాప్ ఓనర్ వారిచ్చిన అడ్రస్ లో వాకబు చేశారు. అతను చెప్పిన పేర్ల ప్రకారం..  అటువంటి వారు ఎవరూ లేరని స్థానికులు తెలపడంతో తాము మోసపోయామని గుర్తించి పీఎస్ లో పిర్యాదు చేసారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మోసానికి పాల్పడ్డ నిందితులు రుంపా దాసు, సురేష్ దాసులుగా సీసీ ఫుటేజీ ద్వారా వారిని గుర్తించారు.  త్వరలోనే వారిద్దర్నీ అరెస్ట్ చేస్తామని చెప్పారు.

Latest Updates