ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్, అతని భార్యా.. ఇద్దరు పిల్లలుగా గుర్తింపు

కర్నూలు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.  పాణ్యం మండలం కౌలూరు గ్రామం వద్ద ఘటన చోటుచేసుకుంది. పిల్లలు ఎక్కడ తప్పించుకుంటారోనని అనుమానంతో దంపతులు తాము నివాసం ఉంటున్న నంద్యాల నుండి ఆటోలో బయలుదేరి వచ్చారు. సుమారు ఆరేడు కిలోమీటర్లు వచ్చాక కౌలూరు గ్రామం వద్ద ఊరి బయట జన సంచారం లేకపోవడంతో రోడ్డుపక్కన ఆటో ఆపి.. పిల్లలను తీసుకుని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఒక పథకం ప్రకారం తమ ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడ్డారు. నలుగురి మృతదేహాల శరీర భాగాలు  తెగిపోయి చెల్లా చెదురుగా పడ్డాయి.  ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తించలేని స్థితిలో ఉండగా.. ఆటో డ్రైవింగ్ లైసన్స్ దొరికింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నంద్యాల రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Latest Updates