నాలుగేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. ఇప్పుడు ఆత్మహత్య

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామాయంపేట మండలం డి. ధర్మారంలో కలకలంరేపింది. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి, రుచిత దంపతులు కుటుంబ కలహాలతో రెండురోజుల క్రితం పురుగుల మందు తాగారు. వారిని చికిత్స నిమిత్తం సిద్ధిపేట మెడికల్ కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి రుచిత చనిపోగా.. శుక్రవారం ఉదయం విజయ్ కుమార్ మృతిచెందారు. విజయ్ కుమార్ అదే గ్రామంలో VRAగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విజయ్, రుచితలు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

 

Latest Updates