ప్రేమ పెళ్లి : నవదంపతుల ఆత్మహత్య

విశాఖ జిల్లా గాజువాకలో విషాదం చోటుచేసుకుంది. కంటయ్యనగర్ లో నవ దంపతులు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నరేంద్రకుమార్( 22),  దిల్లేశ్వరీ(19) కి జనవరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి గాజువాకలో నివాసముంటున్నారు. మృతుడు నరేంద్ర కుమార్ ఆటోనగర్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు . ఇవాళ ఇంటి తలుపులు తెరిచి చూసేలోగా దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పక్కింటి వారు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates