రన్నింగ్ బైక్ పై హల్ చల్ చేసిన ప్రేమికులు

couple-makes-out-on-running-bike-on-delhi-road

సినిమా రేంజ్ లో ఓ ప్రేమ జంట బైక్ పై రోమాన్స్ చేస్తూ హల్ చల్ చేసింది. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ రోడ్డుపై స్టంట్‌ను చేస్తూ ఆ జంట ఎంజాయ్ చేసింది. అది కూడా ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో. ఈ ప్రేమికులు చేసిన విన్యాసాన్ని ఓ ఐపీఎస్ అధికారి తన కెమెరాలో బంధించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. మోటార్ వెహికల్ చట్టంలో కొన్ని కొత్త సెక్షన్‌లు తప్పనిసరి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇలాంటి వారిని పోలీసులు పట్టుకుని కఠనంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. బహిరంగంగా ఇలా రెచ్చిపోవడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమెరా పుటేజి ఆధారంగా ఆ జంటను పట్టుకుని జైల్లో పెట్టాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో వాట్సాప్, ఫేస్ బుక్ పేజీల్లో చక్కర్లు కొడుతుంది.

Latest Updates