లారీని ఓవర్ టేక్ చేస్తూ… దంపతుల దుర్మరణం

కర్నూలు: ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి  గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ఇద్దరూ మృతిచెందారు. ఎమ్మిగనూరు నుండి కర్నూలు వైపు వెళుతున్న లారీని బైకుపై ఓవర్ టేక్ చేసే సమయంలో లారీ తగలడంతో  టైర్ల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులు వివరాలు తెలియాల్సి ఉంది. రాళ్లదొడ్డి గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న కల్వర్టు సమీపంలో ఘటన జరిగింది. బైకుపై వెళ్తున్న భార్యభర్తలు లారీని దాటి ముందుకు వెళ్లే ప్రయత్నంలో కుడి వైపు నుండి లారీని ఓవర్ టేక్ చేయాల్సి ఉండగా.. ఎడమ వైపు నుండి లారీని క్రాస్ చేసేందుకు ప్రయత్నించారు. ఇది గుర్తించని లారీ డ్రైవర్ లారీని కాస్త లెఫ్ట్ సైడ్ కు తిప్పడంతో బైకు లారీని ఢీకొనింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ లారీ టైర్ల కింద పడ్డారు. లారీ టైర్ల కింద పడ్డ శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. రోడ్డుపై వెళుతున్న వాహన దారులు ఘటణ ను చూసి లారీని నిలిపేశారు. బైకుపై నుంచి పడ్డ వారి వద్దకు వచ్చి చూడగా..  తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయి ఉన్నారు.  ఎమ్మిగనూరు రురల్ సిఐ మహేశ్వర రెడ్డి, ఎస్ఐ రామసుబ్బయ్య,  పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని  దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలతోపాటు  ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేపట్టారు.

Latest Updates