ప్రేమ పెళ్లి : జంటను రాళ్లతో కొట్టిచంపారు

couple-stoned-to-death-for-having-an-inter-caste-marriage

బెంగళూరు: ఇంటర్​ క్యాస్ట్​ మ్యారేజ్​ను సహించలేని పెద్దలు ఓ జంటను రాళ్లతో కొట్టిచంపారు. కర్నాటకలోని గదగ జిల్లా లక్కలకట్టిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల వివరణ ప్రకారం.. రమేశ్ మదార్​, గంగమ్మలది ఎస్సీ వర్గమే అయినా, ఉప కులాలు వేరు. పెద్దలు నో చెప్పడంతో పారిపోయి పెండ్లి చేసుకుని,వలసకూలీలుగా జీవించారు. నాలుగేండ్ల తర్వాత బుధవారం ఊరికి తిరిగొచ్చిన జంటను చూసి అమ్మాయి బంధువులు కోపంతో రగిలిపోయారు. రోడ్డుపైనే ఇద్దరిపై దాడిచేసి, ఆ తర్వాత రాళ్లతో కొట్టిచంపారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Latest Updates