కరోనా సోకిందనే అనుమానంతో దంపతుల ఆత్మహత్య

రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులో దారుణం జరిగింది. కరోనా సోకిందనే అనుమానంతో దంపతులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన రమేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య వెంకటలక్ష్మీ ఇళ్లలో పనిచేస్తుంది. మృతుల బంధువుల సమాచారం మేరకు.. వారికి వివాహమై 15 సంవత్సరాలు అయిందని.. వారికి పిల్లలు లేనట్లు తెలుస్తోంది. వీరిద్దరు గురువారం రాత్రి తమ ఇంటికి సమీపంలోని చెట్లపొదల్లో కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకున్నారు. సంఘటనాస్థలంలో పోలీసులు సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్‌లో తమకు ఆర్థిక కష్టాలున్నాయని మరియు కరోనా సోకిందనే అనుమానం కూడా ఉన్నట్లు వారు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో లెటర్‌తో పాటు కిరోసిన్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సూసైడ్ లెటర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు: ఆర్బీఐ

ఒక్కో వ్యక్తికి రూ.91 వేల ఆర్థికసాయం ప్రకటించిన అమెరికా

అద్దె ఇంటి ఓనర్లకు సర్కారు వార్నింగ్

Latest Updates