డైహార్డ్ ఫ్యాన్: పెళ్లి రోజు అర్ధరాత్రి క్రికెట్ మ్యాచ్ చూస్తూ..

ఫొటో ట్వీట్ చేసిన ఐసీసీ.. క్రికెట్ అభిమానుల కామెంట్లు కిర్రాక్

ఇండియా, పాకిస్థాన్ లలో క్రికెట్ అంటే ఓ మతం! ఈ ఆటను ఎంజాయ్ చేసేవాళ్లకు అదో పిచ్చి!! నచ్చనోళ్లకు బోరింగ్ గేమ్.. అదే ఒక్కసారి క్రికెట్ ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తే.. దాని ముందు ఏదైనా తక్కువే!! ఎంతగా అంటే.. ఈ ఫొటో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

పెళ్లి డ్రస్ లో ఉన్న జంట.. ఫొటోకు రివర్స్ లో ఇచ్చిన పోజ్ కాదిది. ఆ పెళ్లి కొడుకు క్రికెట్ లవర్.. నోనో.. ఇది సరిపోదు.. డైహార్డ్ ఫ్యాన్. ఆ రోజే పెళ్లయింది. కానీ అర్ధరాత్రి వేళ టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉంది. పెళ్లి సంబరం కన్నా ముందు మ్యాచ్ చూడాలన్న తపనలో నుంచి పుట్టిన ఫొటో ఇది.

ఆ పెళ్లి కొడుకు పేరు హసన్ తస్లీమ్. ఉండేది అమెరికా. గత వీకెండ్ లో ఓ అమెరికా యువతిని నిఖా చేసుకున్నాడు. అదే రోజు రాత్రి పాకిస్థాన్ – ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ ఉంది. షాదీ తంతు ముగించుకుని ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అయ్యింది. ఇంటిలో పెళ్లికూతురికి స్వాగతం చెబుతూ ఆ పెద్దలు చేసే కొన్ని సంప్రదాయ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ హడావుడి ఓ వైపు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఓ వైపు!! రెండింట్లో క్రికెట్ మ్యాచే గెలించింది. అతడి మనసును తెలుసుకున్న పెళ్లికూతుకు కూడా మ్యాచ్ ను ఎంజాయ్ చేసింది.

‘క్రికెట్ డైహార్డ్ ఫ్యాన్ గా ఎప్పుడూ మ్యాచ్ లు మిస్ కాలేదు. అమెరికాలో ఉండడం వల్ల మ్యాచ్ లన్నీ అర్ధరాత్రి మేలుకుని చూడాల్సి వచ్చేది. అయినా వదిలేవాడిని కాదు. ఈ మ్యాచ్ కూడా అంతే’ అంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ పంపాడు. వాళ్లు మ్యాచ్ చూస్తున్న ఫొటో కూడా జత చేశాడు. దీన్ని #CoupleGoals అనే హ్యాష్ ట్యాగ్ తో ఐసీసీ ట్వీట్ చేసింది.

మ్యాచ్ ఉంటే పెళ్లి ఎలా చేసుకోగలం..?

ఈ ట్వీట్ పై క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న కామెంట్లు కిర్రాక్ గా ఉన్నాయి. భవిష్యత్తులో ఒక రోజు నేను కూడా ఇలానే చేయాల్సొస్తుందేమో అని ఒకరు.. దటీజ్ క్రికెట్ లవ్ అంటూ మరొకరు ట్వీట్టు చేశారు. ఓ నెటిజన్ అయితే అసలు క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజున అసలు ఎవరైనా పెళ్లి ఎలా చేసుకోగలరంటూ కామెంట్ పెట్టారు.

Latest Updates