బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే

బొగ్గు కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఇవాళ(మంగళవారం) తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చింది. 1999లో ఝార్ఖండ్‌లో బొగ్గు కేటాయింపుల్లో అక్ర‌మాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సుదీర్ఘ విచారణ కొనసాగింది. 1999లో ఝార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్ర‌హ్మ‌దిహ బొగ్గు గ‌నుల‌ను కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేటాయింపుల్లో ఈ నలుగురు అవినీతికి పాల్పడినట్లు ప్రత్యేక కోర్టు గుర్తించింది. వాజ్‌పేయీ ప్ర‌భుత్వ హ‌యంలో ఉక్కు, బొగ్గుశాఖ మంత్రిగా దిలీప్ పనిచేశారు. నలుగురు దోషులు నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు ప్ర‌త్యేక జ‌డ్జి భార‌త్ ప‌రాశ‌ర్ తెలిపారు. దిలీప్‌తో పాటు దోషులుగా తేలిన వారిలో బొగ్గుగ‌నుల శాఖ‌లో ప‌నిచేసిన సీనియ‌ర్ అధికారులు కూడా ఉన్నారు. ఈ నెల 14న కోర్టు వీరందరికి శిక్షను ఖరారు చేయనుంది.

Latest Updates