అఖిలప్రియ పిటిషన్ కొట్టేసిన కోర్టు

హాకీ మాజీ ప్లేయర్ ప్రవీణ్‌రావు ,అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్‌ కేసులో A-1గా ఉన్న భూమా అఖిలప్రియకు గురువారం సికింద్రాబాద్‌ కోర్టులో నిరాశ ఎదురైంది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని, బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిన్న A-2 గా ఉన్న అఖిల ప్రియను ఇవాళ A-1 గా చేర్చారని కోర్టుకు తెలిపారు. ప్రజాప్రతినిధిగా  ఉన్న ఆమెకు కనీసం 41సీఆర్సీసీ కింద ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు.

పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. జైలులోనే అఖిలప్రియకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని.. డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారని తెలిపింది. ఒకవేళ అఖిలప్రియ ఆరోగ్యం బాగాలేదని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని జైలు అధికారులు సూచిస్తే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటి(శుక్రవారం)కి వాయిదా వేసింది.

కిడ్నాప్ కేసులో‌ అఖిలప్రియ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో 14 రోజుల రిమాండ్‌లో  ఉన్నారు.

Latest Updates