పోలీసు కస్టడీకి ‘దిశ’ నిందితులు

  • నేటి నుంచి పది రోజుల విచారణ
  • ప్రజాగ్రహం నేపథ్యంలో కేసులో సీక్రెసీ
  • చర్లపల్లి జైలులోనేవిచారించే అవకాశం?
  • జైలుతో పాటు కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు

హైదరాబాద్, వెలుగు:

దిశ అత్యాచారం, హత్యకేసు నిందితులను కోర్టు పది రోజుల కస్టడీకి అప్పగించింది. నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించాలని కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిని షాద్​నగర్​ అదనపు జూనియర్​సివిల్​ జడ్జి శ్యామ్​ ప్రసాద్​ మంగళవారం విచారించారు. ఇందులో సీన్​ రీకన్​స్ట్రక్షన్​తో పాటు మరికొన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో నిందితులను బుధవారం నుంచి ఈ నెల 12 వరకు కస్టడీకి అనుమతిస్తూ షాద్​నగర్​ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిందితులపై ప్రజాగ్రహం తీవ్రంగా ఉండడంతో పోలీసులు ఈ కేసులో సీక్రెసీ మెయింటైన్​ చేస్తున్నారు. నిందితుల ఐడీ పరేడ్ కూడా సీక్రెట్​గా పూర్తిచేశారు. లా అండ్​ ఆర్డర్​ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చర్లపల్లి జైలులో రిమాండ్​ ఖైదీలుగా ఉన్న నలుగురు నిందితులను రహస్యంగా విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

పటిష్ట బందోబస్తు మధ్య..

చర్లపల్లి జైలుతో పాటు షాద్​నగర్​ కోర్టు వద్ద పోలసులు మంగళవారం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్, రాచకొండ సీపీలు సజ్జనార్, మహేశ్​ భగవత్​ఉన్నతాధికారులతో చర్చించారు. నిందితులను ఎక్కడ విచారించాలనే విషయాన్నీ పరిశీలించారు. ఎక్కడికి తరలించినా సమస్యలు తప్పకపోవచ్చనే సందేహంతో నిందితులను జైల్లోనే విచారించే అవకాశాలు ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది.

వేర్వేరు బ్యారెక్స్ లో నిందితులు

జైలులో నిందితులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నలుగురినీ వేర్వేరు బ్యారెక్స్​లలో ఉంచారు. నలుగురు కలిస్తే కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని విడివిడిగా విచారించడం వల్ల ప్రాసిక్యూషన్​కు బలమైన సాక్ష్యాలు దొరుకుతాయని భావిస్తున్నారు. కస్టడీలో బయటపడే వివరాలతో నిందితులపై చార్జిషీట్​ ఫైల్​ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

court has handed over 10-day custody of accused in Telangana doctor rape-murder case

Latest Updates