నటుడు జితేంద్రపై రేప్ కేసు కొట్టేసిన హైకోర్టు

బాలీవుడ్‌ నటుడు జితేంద్రపై నమోదైన అత్యాచారం కేసును హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. 48 సంవత్సరాల క్రితం జితేంద్ర తన కజిన్‌పై అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరి 16న దాఖలై ఎఫ్‌ఐఆర్‌ను జస్టిస్‌ అజయ్‌ మోహన్‌ గోయెల్‌ కొట్టివేశారు. జితేంద్ర కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వహించిన ఆడిషన్‌ టెస్టులో బాధితురాలి కుమార్తె ఎంపిక కాకపోవడంతో కావాలని ఈ కేసు పెట్టినట్లు జితేంద్ర పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణకు సంబంధించిన ఆధారాలేమీ బాధితురాలు సమర్పించలేదని, ఇది కేవలం అస్పష్టమైన, అసంబద్ధమైన కేసుగా కనిపిస్తోందని న్యాయమూర్తి అన్నారు.

 

Latest Updates